Guntur: నవంబర్ 5న జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కలెక్టర్ ప్రకటన!

Guntur: గుంటూరు జిల్లాలో నవంబర్ 5న జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్, 7న కౌంటింగ్. రీషెడ్యూల్ ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Oct 2026 9:39 PM IST
Guntur
X

Guntur: నవంబర్ 5న జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కలెక్టర్ ప్రకటన!

గుంటూరు: జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు స్థానాలకు నవంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగుతుందని, ఏడవ తేదీన లెక్కింపు జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలపై నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏడవ తేదీ ఉదయం 8 గంటల నుండి ప్రారంభం అవుతుందని అన్నారు.

ఎన్నికల సంఘం మార్పు చేసిన తేదీలను ఓటర్లు గమనించి నవంబరు 5వ తేదీన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిందని, ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను సైతం ప్రకటించడం జరిగిందని చెప్పారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN