Guntur: ఎన్నికల కోడ్ ఉల్లంఘన: ఇద్దరు ఆప్కాస్ ఉద్యోగులపై వేటు!

Guntur: గుంటూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు ఆప్కాస్ (APCOS) ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు కమిషనర్ మయూర్ అశోక్ సిఫార్సు చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 23 Oct 2026 11:37 PM IST
Guntur
X

Guntur: ఎన్నికల కోడ్ ఉల్లంఘన: ఇద్దరు ఆప్కాస్ ఉద్యోగులపై వేటు!

గుంటూరు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు APCOS ఉద్యోగులపై చర్యలు. నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కే.మయూర్ అశోక్, జిఎంసిలో మలేరియా విభాగంలో ఆప్కాస్ లో వర్కర్ గా పనిచేసే మందా కిషోర్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు, జిఎంసిలో ఆప్కాస్ సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించే షేక్ గౌస్ పీరా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు, పై ఇద్దరినీ ఉద్యోగాల నుండి తొలగించేందుకు శుక్రవారం జిల్లా కలెక్టర్ & APCOS ఎండీకి లేఖలు పంపినట్లు తెలిపిన కమిషనర్.

ఎన్నికల ప్రచారాల్లో ఉద్యోగులు ఎట్టి పరిస్తితుల్లో పాల్గొనకూదని, పాల్గొంటే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కమిషనర్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN