Guntur: గుంటూరు అభివృద్ధికి కూటమినే గెలిపించాలి: మాజీ మేయర్!

Guntur: గుంటూరు 36వ డివిజన్‌లో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతుగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర ముమ్మర ప్రచారం నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Oct 2026 11:51 PM IST
Guntur
X

Guntur: గుంటూరు అభివృద్ధికి కూటమినే గెలిపించాలి: మాజీ మేయర్!

గుంటూరు: గుంటూరు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర పిలుపునిచ్చారు. గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతుగా 36వ డివిజన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ.. తెలగమాంబ చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించింది తామేనని, వాటిని పూర్తి చేసేది కూడా తామేనని స్పష్టం చేశారు.

గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసేందుకు కూటమి కట్టుబడి ఉందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో గుంటూరు నగరంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో పూర్తికాని పలు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసిందని వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి దాసరి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ చల్లా రాజ్యలక్ష్మి, స్థానిక టీడీపీ నాయకులు షేక్ సుకూర్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గుంటూరు ప్రఖ్యాత్, బీసీ నాయకులు అక్కినేడి మల్లికార్జున్, కాపు నాయకులు సూరిశెట్టి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN