Guntur: ఏటుకూరులో పోలీసుల రూట్ మార్చ్.. డీఎస్పీ పూర్ణచంద్రరావు వార్నింగ్!
Guntur: గుంటూరు ఏటుకూరులో నల్లపాడు సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో పోలీసుల కవాతు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు.
Guntur: ఏటుకూరులో పోలీసుల రూట్ మార్చ్.. డీఎస్పీ పూర్ణచంద్రరావు వార్నింగ్!
గుంటూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నల్లపాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు గ్రామంలో సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు పర్యవేక్షణలో, నల్లపాడు సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కవాతు చేపట్టారు. గ్రామంలో పోలీసుల కవాతుతో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు భరోసా కల్పించారు.
నల్లపాడు సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో ఎన్నికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, రాజకీయ విభేదాలతో గొడవలకు దిగకుండా సంయమనం పాటించాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించాలని, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. ప్రజల భద్రతకు నల్లపాడు పోలీసుల భరోసా!




