Guntur: 64వ డివిజన్‌లో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారం!

Guntur: గుంటూరు 64వ డివిజన్ ప్రచారంలో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ. నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ప్రజలకు భరోసా.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Oct 2026 6:08 PM IST
Guntur
X

Guntur: 64వ డివిజన్‌లో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారం!

గుంటూరు: గుంటూరు నగర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ 64వ డివిజన్ లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

కోవెలమూడి లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ..

గుంటూరులోనే ఉంటూ నగర అభివృద్ధిని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా గమనించానని లక్ష్మీ అపర్ణ పేర్కొన్నారు. మాజీ మేయర్ కోవెలమూడి నాని, స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందించిన సహకారం మాదిరిగానే తాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

గుంటూరును దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు పెళ్లి మాణిక్యాలరావు. జనసేన నేత కిలారి రోశయ్య ,కార్పొరేటర్ అభ్యర్థి యర్రంశెట్టి రాజేష్, కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN