Guntur: విజిలెన్స్ విభాగానికి బదిలీ అయిన డీఎస్పీ మురళీకృష్ణ!

Guntur: గుంటూరు నార్త్ సబ్‌డివిజన్ డీఎస్పీగా సేవలందించి విజిలెన్స్ విభాగానికి బదిలీ అయిన మురళీకృష్ణను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా సత్కరించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Oct 2026 5:25 PM IST
Guntur
X

Guntur: విజిలెన్స్ విభాగానికి బదిలీ అయిన డీఎస్పీ మురళీకృష్ణ!

Guntur: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సెప్టెంబర్ నెల క్రైమ్ రివ్యూ సమావేశం ముగిసిన అనంతరం, నార్త్ సబ్‌డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, శాలువా, పూలదండతో ఘనంగా సత్కరించారు.

నార్త్ సబ్‌డివిజన్ డీఎస్పీగా మురళీకృష్ణ రెండు సంవత్సరాల రెండు నెలల పాటు సేవలందించి, ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి బదిలీ అయిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN