Kakumanu: కాకుమాను మండలంలో పోలింగ్ బూత్‌లను పరిశీలించిన అధికారులు!

Kakumanu: గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సై కలసి పోలింగ్ బూత్‌లు, సరిహద్దు చెక్‌పోస్టులను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 17 Oct 2026 1:18 PM IST
Kakumanu
X

Kakumanu: కాకుమాను మండలంలో పోలింగ్ బూత్‌లను పరిశీలించిన అధికారులు!

Kakumanu: గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని గ్రామాలలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్లను స్వయంగా మండల అధికారులైన ఎమ్మార్వో వెంకటస్వామి గారు ఎంపీడీవో గ వీరస్వామి గారు కాకుమాన్ఎస్సై హరికృష్ణ గారు కాకుమాను మండలం స్పెషల్ బ్రాంచ్ పోలీసు వారు స్వయంగా పోలింగ్ బూత్ సందర్శించి పరిశీలించినారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడటంతో జిల్లా అధికారులైన కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు సూచనతో మండలంలో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. మండలంలోని నేతలు మరియు ప్రజలు కూడా మండల అధికారులకు సహకరిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని సూచించారు అదేవిధంగా అంతర్ జిల్లా బోర్డర్ అయినా కాకుమాను మండలంలోని రేటూరు గ్రామంలో గ్రామంలో చెక్ పోస్ట్/ స్టాటిక్ సర్విలన్స్ టీం ఏర్పాటు చేసి వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తూ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా సెంచరీస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ను మండలంలో సక్రమంగా అమలు చేస్తున్నట్లు మండలంలో స్థానికఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల అధికారులు తెలియజేసినారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU