Pedakakani: పెదకాకాని ఆలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్!

Pedakakani: గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 3 Sept 2026 4:49 PM IST
Pedakakani
X

Pedakakani: పెదకాకాని ఆలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్!

పెదకాకాని: ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మొత్తం 68 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల్లో 50 గ్రాముల నాగాభరణం, రెండు బంగారు మంగళసూత్రాలు, బంగారు గుత్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు Cr.No.448/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, చోరీకి పాల్పడిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. . కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA