Guntur: పట్టాభిపురంలో అనుమతి లేని డీజేను స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Guntur: గుంటూరు పట్టాభిపురం బీఆర్ గార్డెన్స్ వద్ద అనుమతి లేని డీజే సీజ్ చేసిన పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Sept 2026 3:01 PM IST
Guntur
X

Guntur: పట్టాభిపురంలో అనుమతి లేని డీజేను స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Guntur: పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఆర్ గార్డెన్స్ సమీపంలో వినాయక చవితి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన డీజేను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా డీజే ఏర్పాటు చేసినట్లు గుర్తించిన పోలీసులు చర్యలు చేపట్టారు.

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, పోలీసుల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పోలీసులు సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN