Guntur: పోలింగ్ సందర్భంగా నవంబరు 26, 29, డిసెంబరు 2న సెలవు

Guntur: మంగళగిరి తాడేపల్లి, పొన్నూరు మున్సిపాలిటీ, పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో నవంబరు 26, 29, డిసెంబరు 2న సెలవు ప్రకటించిన గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 23 Nov 2026 8:26 PM IST
Guntur
X

Guntur: పోలింగ్ సందర్భంగా నవంబరు 26, 29, డిసెంబరు 2న సెలవు

గుంటూరు: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ, పొన్నూరు మున్సిపాలిటీలో నవంబర్ 26వ తేదీన పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో స్థానిక సెలవును ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని చెప్పారు.

ఎన్నికలు నిర్వహించనున్న ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా స్థానిక సెలవు ప్రకటించినట్లు వివరించారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, 1881 పరిధిలోకి వచ్చే పోలింగ్ ప్రాంతాల్లో సైతం ఇది వర్తిస్తుందని చెప్పారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకునే కునేందుకు సెలవును ప్రకటించడం జరిగిందని వివరించారు.

నవంబరు 29, డిసెంబరు 2 పంచాయతీ పోలింగ్ నవంబరు 29, డిసెంబరు 2వ తేదీన పంచాయతీ పోలింగ్ జరుగుతున్నందున ఆయా ప్రాంతాల్లో స్థానిక సెలవును ప్రకటించడం జరిగిందని చెప్పారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN