Guntur: జాతీయ స్థాయి సర్వేయింగ్ పోటీల్లో ఆర్వీఆర్ అండ్ జెసీ విద్యార్థులు
Guntur: జాతీయ స్థాయి సర్వేయింగ్ పోటీల్లో ప్రతిభ చాటి ద్వితీయ స్థానం సాధించిన గుంటూరు ఆర్.వి.ఆర్. & జె.సి. కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.
Guntur: జాతీయ స్థాయి సర్వేయింగ్ పోటీల్లో ఆర్వీఆర్ అండ్ జెసీ విద్యార్థులు
గుంటూరు: తరగతి గది నుంచే ప్రాక్టికల్ నాలెడ్జ్, సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నత విజయాలను సాధించగలరని ఆర్.వి.ఆర్. & జె.సి. ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు డా. రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లమూడి మురళీమోహన్, డా. జగదీష్ కె. మద్దినేని పేర్కొన్నారు.
ఇటీవల నర్సాపూర్‌లో జరిగిన నేషనల్ లెవెల్ సర్వేయింగ్ కాంపిటీషన్ - 2026 పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాశాలల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థి జట్లు పాల్గొన్నాయి. అత్యంత పోటీ వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ సర్వేయింగ్ సాంకేతికతలు, ఖచ్చితమైన కొలతలు, ప్రాక్టికల్ సమస్యల పరిష్కారం, ఆధునిక సర్వేయింగ్ పరికరాల వినియోగంలో ప్రతిభను ప్రదర్శించిన ఆర్.వి.ఆర్. & జె.సి.. ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేత విద్యార్థులు ట్రోఫీ, సర్టిఫికెట్లతో పాటు రూ.15,000 నగదు బహుమతిని నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను సోమవారం నాడు కళాశాల సిబ్బంది అభినందించారు.
విద్యార్థులను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ స్కిల్స్, ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణకు కళాశాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాల కృష్ణ, ట్రెజరర్ డా. కొండబోలు కృష్ణ ప్రసాద్ తెలిపారు.
కంప్యూటర్ ఆధారిత ఇంజనీరింగ్ కోర్సులతో పాటు కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లోనూ ఆధునిక సాంకేతికతను అనుసంధానిస్తూ నాణ్యమైన విద్యాబోధన, ప్రయోగాత్మక శిక్షణ అందించడం వల్లే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డా.కొల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల అకడమిక్ అండ్ ఆర్&డి డైరెక్టర్ డా. కె.రవీంద్ర, కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ &అడ్మినిస్ట్రేషన్ డా. ఎన్.వి. శ్రీనివాసరావు విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డా.ఏ.శ్రీనివాస ప్రసాద్, మెంటార్ డా.ఆర్.వైష్ణవ కుమార్ తదితరులు కలరు.




