Guntur: ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో జాతీయ స్థాయి నృత్య పోటీలు

Guntur: గుంటూరు చౌడవరం ఆర్.వి.ఆర్ & జె.సి ఇంజనీరింగ్ కళాశాలలో ‘క్లబ్ వాల్ట్జ్’ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి నృత్య పోటీలు ఘనంగా ముగిశాయి.

ANANDBABU,	PRATTIPADU
Published on: 6 Oct 2026 7:00 PM IST
Guntur
X

Guntur: ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో జాతీయ స్థాయి నృత్య పోటీలు

గుంటూరు జిల్లా: సాంకేతిక పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు చక్కటి వేదికగా నిలుస్తాయని కళాశాల అధ్యక్షులు డా. రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లమూడి మురళీమోహన్, డా. జగదీష్‌ కె. మద్దినేని పేర్కొన్నారు.

ఆర్.వి.ఆర్. & జె.సి. ఇంజనీరింగ్ కళాశాలలో ‘క్లబ్ వాల్ట్జ్ (Club Waltz)’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి అంతర్ కళాశాలల నృత్య పోటీలు మంగళవారం నాడు ఘనంగా ముగిశాయి. వివిధ కళాశాలల నుండి 200 టీం ల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ నృత్య ప్రతిభను చాటారు.

కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు జానపద, వెస్ట్రన్, సోలో, గ్రూప్ తదితర విభాగాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. విభిన్న విభాగాల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీల సందర్భంగా కళాశాల ప్రాంగణం విద్యార్థుల నృత్య ప్రదర్శనలతో ఉత్సాహభరితంగా మారింది.

విద్యార్థులకు విద్యా విజ్ఞానంతో పాటు కళలు కూడా అంతర్భాగమని, విద్యార్థి దశలో పాల్గొనే ఇటువంటి సాంస్కృతిక పోటీలు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా నిలుస్తాయని కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాల కృష్ణ, ట్రెజరర్ డా. కొండబోలు కృష్ణ ప్రసాద్ తెలిపారు.

7 విభాగాల్లో ప్రతిభ కనబరిచి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులతో పాటు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కొల్లా శ్రీనివాస్, కళాశాల అకడమిక్ అండ్ ఆర్&డి డైరెక్టర్ డా. కె.రవీంద్ర, కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ &అడ్మినిస్ట్రేషన్ డా. ఎన్.వి. శ్రీనివాసరావు, కళాశాల కల్చరల్ కమిటీ కన్వీనర్ రంగరాయ చౌదరి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU