Guntur:5 వేల గారెలతో హనుమంతునికి అలంకరణ: సీతానగరంలో వేడుకలు

Guntur: గుంటూరు జిల్లా సీతానగరంలో గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని 5 వేల గారెల మాలలతో శ్రీ ఆంజనేయ స్వామికి భక్తులు దివ్య అలంకరణ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 July 2026 9:34 PM IST
Guntur
X

Guntur:5 వేల గారెలతో హనుమంతునికి అలంకరణ: సీతానగరంలో వేడుకలు

గుంటూరు జిల్లా

5వేల గారెలతో మారుతికి దివ్యాలంకరణ

గుంటూరు జిల్లా సీతానగరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని 5 వేల గారెలతో అందంగా ముస్తాబు చేశారు. గుంటూరు జిల్లా సీతానగరం లో గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తులు ఈ దివ్య అలంకరణ గావించారు. గారెల మాలలతో కనువిందు చేస్తున్న మారుతిని వీక్షించేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.

రామ భక్తుడైన ఆంజనేయునికి గారెలు అంటే మహా ప్రీతి. తనకు గారెలను సమర్పించిన భక్తులకు శని బాధలు ఉండబోవని స్వామి అభయమిచ్చినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. అందుకే పవనసుతునికి గారెల మాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గురు పౌర్ణమి పురస్కరించుకుని గుంటూరు జిల్లా సీతానగరంలో గల చెట్టు కింద ఆంజనేయస్వామికి 5000 గారెలను సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆంజనేయ స్వామి వారికి వినూత్న రీతిలో సమర్పించిన గారెల అలంకరణలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గురు పౌర్ణమి పవిత్రతను చాటేలా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గారెలతో ప్రత్యేక సేవ నిర్వహించామని ఆలయ అర్చకులు వివరించారు.

స్వామివారికి గారెల మాలలను సమర్పించడంతోపాటు ఆలయాన్ని సైతం అందంగా కళాత్మకంగా గారెలతో అలంకరించడంతో పరిసర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. గారెలు మాలలతో శోభిల్లుతున్న ఆంజనేయ స్వామి వారి దివ్య రూపాన్ని వీక్షిస్తున్న భక్తజనం పరవశిస్తున్నారు. వేలాది గారెల మాలలతో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు చెబుతున్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story