Guntur: ఎన్నికల ప్రచారానికి సింగిల్ విండో అనుమతులు తప్పనిసరి: కమిషనర్
Guntur: గుంటూరు నగరంలో ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, మైకుల వినియోగానికి సింగిల్ విండో విధానం ద్వారా ముందస్తు అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.
Guntur: ఎన్నికల ప్రచారానికి సింగిల్ విండో అనుమతులు తప్పనిసరి: కమిషనర్
గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సంబంధిత అధికారుల అనుమతి అవసరమయ్యే వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి పోటీ చేసే అభ్యర్థులు లేదా వారి అధీకృత ఎన్నికల ఏజెంట్లు 'సింగిల్ విండో అనుమతుల విధానం' (Single Window Permission System) ద్వారా ముందస్తు అనుమతి పొందాలని, నగరంలో ఎన్నికల నిబంధనలు పక్కా అమలుకు పోలీస్ ప్రత్యేక నిఘా బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, ఇప్పటికే నగరంలో ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారి పై రెండు కేసులు నమోదు అయ్యాయని నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె. మయూర్ అశోక్ తెలియచేశారు.
బహిరంగ ప్రదేశాలలో ఎన్నికల ప్రచార సభలు, రాజకీయ ర్యాలీలు, రోడ్ షోలు, పాదయాత్రలు మరియు ఊరేగింపులు నిర్వహించడానికి, అలాగే మైకులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, ధ్వని ప్రసార పరికరాల వినియోగం ఎన్నికల ప్రచార సభల కోసం ఏర్పాటు చేసే వాటికి ఈ సింగిల్ విండో ద్వారా ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు.
ఇందుకోసం నగర పాలక సంస్థ ఉపా సెల్ నందు నగర పాలక సంస్థ మరియు పోలీస్ అధికారుల సమన్వయంతో ప్రత్యేక సింగల్ విండో కౌంటర్ ఏర్పాటు చేశామని, ఈ కౌంటర్ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉండి దరఖాస్తు చేసిన 24 గంటలలో అనుమతులు మంజూరు చేస్తారన్నారు. అంతేకాక ప్రచార వాహనాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారి యొక్క అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.




