Guntur: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ఎస్పీ!
Guntur: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు.
Guntur: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ఎస్పీ!
గుంటూరు: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే" కార్యక్రమంలో ఈరోజు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పాల్గొని, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల, విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నుండి వ్యక్తిగత, సేవా సంబంధిత సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు మరియు ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రతి వినతిని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, శాఖ నిబంధనలకు అనుగుణంగా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావంతో వ్యవహరించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం, భద్రతాభావం మరింత పెంపొందేలా సేవలందించాలని సూచించారు.
పోలీస్ శాఖ ఒక కుటుంబం. పరస్పర సహకారం, సమన్వయం, పరస్పర గౌరవంతో పనిచేసినప్పుడే సంస్థ మరింత బలోపేతం అవుతుంది. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ పేర్కొన్నారు.




