Guntur: గుంటూరు పోగొట్టుకున్న మొబైల్స్ బాధితులకు అందజేత
Guntur: గుంటూరులో రూ.28 లక్షల విలువైన 140 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ వకుల్ జిందాల్. ఇప్పటివరకు రూ.9 కోట్ల విలువైన ఫోన్లను రికవరీ చేసిన ఐటీ కోర్.
Guntur: గుంటూరు పోగొట్టుకున్న మొబైల్స్ బాధితులకు అందజేత
గుంటూరు: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సుమారు రూ.28 లక్షల విలువైన 140 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ప్రజలు పోగొట్టుకున్న లేదా వారి వద్ద నుండి దొంగిలించబడిన సెల్ ఫోన్లను గుర్తించి తిరిగి అందజేయడంలో గుంటూరు జిల్లా ఐటీ కోర్ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.9 కోట్ల 80 వేలు విలువైన 4,504 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు వాటిలోని వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం తో పాటు అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్‌కు కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫిర్యాదుల ఆధారంగా మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి, ఎటువంటి రుసుము లేకుండా బాధితులకు తిరిగి అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. కొన్ని మొబైల్ ఫోన్స్ ను అస్సాం రాష్ట్రం బీహార్ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం నుండి కూడా రికవరీ చేయడం జరిగింది.
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నందున సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించకుండా వెంటనే బ్లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ ఫోన్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన ఐటీ కోర్ సిబ్బంది సీఐ నిషార్ భాష , హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్ సాహెబ్, యాసిన్, అరుణ, మానస,అలాగే సీసీఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ , కానిస్టేబుల్ కరీముల్లా లను ఎస్పీ అభినందించారు..




