Garikapadu: గరికపాడులో పట్టపగలే భారీ చోరీ - 17 లక్షల నగదు, బంగారం అపహరణ
Garikapadu: గుంటూరు జిల్లా గరికపాడులో పట్టపగలే భారీ దోపిడీ. పొలం కొనుగోలుకు దాచుకున్న రూ.17 లక్షలు, 6 సవర్ల బంగారం అపహరణ. ఆందోళనలో స్థానికులు.
Garikapadu: గరికపాడులో పట్టపగలే భారీ చోరీ - 17 లక్షల నగదు, బంగారం అపహరణ
గరికపాడు: గుంటూరు జిల్లా....కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో షేక్ మస్తాన్ అనే వ్యక్తి ఇంట్లో దోపిడీ చేసిన దొంగల ముఠా. పొలం కొనుక్కోవడం కోసం ఇంటిలో 17 లక్షల రూపాయల నగదు, ఆరు సవర్ల బంగారం దాచుకున్న కుటుంబ సభ్యులు.
ఈరోజు మధ్యాహ్నం గేదలను తోలుకొని పొలం పనులకు వెళ్లి దగ్గరికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టిన వైనం. 17 లక్షల డబ్బులు, ఆరు సవర్ల బంగారం ఆపహరించుకు పోయిన గుర్తు తెలియని దుండగులు.
గత కొద్ది రోజుల కిందట ప్రత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడులో పట్టపగలే ఇంటిని దోచుకున్న సంఘటన మరువక ముందే గరికపాడులో జరగడంతో బిక్కు బిక్కు మంటున్న స్థానికులు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జరిగిన ఘటనలపై చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు
ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని గుంటూరు రూరల్, వట్టి చెరుకూరు, కాకుమాను, పెద నందిపాడు, ప్రత్తిపాడు మండలాల్లోని గ్రామాలలో గస్తీ ముమ్మరం చేయాలని కోరుతున్న ప్రజలు




