Guntur: గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్!
Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం కార్పొరేటర్లు ప్రజా గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు.
Guntur: గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్!
గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్లు ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి వినతులు, అర్జీలు స్వీకరించారు. కార్పొరేటర్లు గుర్రం ప్రసాద్, బెజ్జం అనిల్, గంటా మౌళిక, తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీలలు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను నమోదు చేసుకుని ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని వారు పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి గ్రీవెన్స్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని వారు తెలిపారు.




