Guntur: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి ఈనెల 19 వరకు రిమాండ్
Guntur: గుంటూరు వెంగళాయపాలెంలో ఆందోళన కేసులో వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. కోర్టు ఈనెల 19 వరకు రిమాండ్ విధించింది.
Guntur: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి ఈనెల 19 వరకు రిమాండ్
గుంటూరు: గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో పరిషత్ ఎన్నికలు ముగిసిన తర్వాత పోలీసులు, అధికారుల సాయంతో టీడీపీ నేతలు బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆయనను గురువారం రాత్రి తొలుత నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తర్వాత జిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి ఈనెల 19వ తేదీ వరకు రిమాండ్ విధించారు.




