Guntur: నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించాలి
Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపునకు శ్రేణులు కృషి చేయాలని కోరిన రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.
Guntur: నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించాలి
గుంటూరు: త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలిచి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్టుగా ఇవ్వాలని వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గుంటూరు లోని ఏ కన్వెన్షన్ లో జరిగిన వైఎస్ఆర్సిపి గుంటూరు మున్సిపల్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసే అన్ని స్థానాలలో విజయం సాధించాలని కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అని చెప్పి ఏ ఒక్క హామీ అమలు పరచలేదు అన్నారు. వైసిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు.
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్ రాగానే అభ్యర్థుల ఎంపిక వేగవంతం చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు కూర్చొని సమన్వయంతో పనిచేసే వైఎస్ఆర్సిపి జెండాను కార్పొరేషన్ లో ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అయోధ్య రామిరెడ్డి, అప్పిరెడ్డి, ఏసురత్నం, వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర అధ్యక్షులు నూరి ఫాతిమా, డైమండ్ బాబు, కిరణ్ కుమార్, సుచరిత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




