Gurazala: వికాస్ విద్యా సంస్థల్లో ఘనంగా గురుపూజోత్సవం
Gurazala: గురజాలలోని వికాస్ విద్యా సంస్థలలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందాన్ని సత్కరించిన విద్యార్థులు.
Gurazala: వికాస్ విద్యా సంస్థల్లో ఘనంగా గురుపూజోత్సవం
గురజాల: గురజాలలోని వికాస్ విద్యా సంస్థలలో గురుపూజోత్సవ దినం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల ప్రిన్సిపాల్ ను, ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజానికి భావిభారత పౌరులను అందించే ప్రక్రియలో గురువుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధిపతి అడప శ్రీనివాసరావు,షేక్ జాన్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు




