Vinukonda: ప్రజల ముంగిటకే పాలన.. సమస్యలపై జీవీ ఆంజనేయులు ఆరా

Vinukonda: వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల ఎంపీడీవో కార్యాలయంలో జీవీ ఆంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 5 May 2026 6:29 PM IST
Vinukonda
X

Vinukonda: ప్రజల ముంగిటకే పాలన.. సమస్యలపై జీవీ ఆంజనేయులు ఆరా

Vinukonda: వినుకొండ నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండేలా పాలనను తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా, నూజెండ్ల గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జీవి ఆంజనేయులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రత్యక్షంగా వివరించే అవకాశం పొందారు.

ప్రజల నుంచి మౌలిక సదుపాయాల కొరత, పెన్షన్ల సమస్యలు, విద్యుత్ ఇబ్బందులు వంటి పలు అంశాలపై వినతిపత్రాలు స్వీకరించిన ఆయన, ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, పాలన ప్రజల వద్దకే చేరాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story