Vinukonda: పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది ‘స్వచ్ఛాంధ్ర’లో జీవీ ఆంజనేయులు!

Vinukonda: వినుకొండ ఓబయ్య కాలనీలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ పారిశుధ్య పనుల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు.

KAREEMULLA, VINUKONDA
Published on: 22 Aug 2026 12:57 PM IST
Vinukonda
X

Vinukonda: పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది ‘స్వచ్ఛాంధ్ర’లో జీవీ ఆంజనేయులు!

Vinukonda: వినుకొండ పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం ఓబయ్య కాలనీలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు. ఇళ్లు, వీధులు, కాలనీలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులు కేవలం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం కూడా తమ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి–పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని కోరారు. పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రజలు స్వచ్ఛతను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు.

స్వచ్ఛ వినుకొండ నిర్మాణం కోసం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జీవీ ఆంజనేయులు కోరారు. స్వచ్ఛతను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story