Chirala: చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం!
Chirala: బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో హెచ్‌సీజీ ఎంఎన్‌ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Chirala: చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం!
చీరాల: బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన హెచ్‌సీజీ ఎంఎన్‌ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి క్యాన్సర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పలువురు రోగులు హాజరై వైద్య సేవలు పొందారు.
ఈ సందర్భంగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ ఒంగోలులోని తమ క్యాన్సర్ ఆసుపత్రిలో పేద ప్రజలకు, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు క్యాన్సర్ చికిత్సను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి మెరుగైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల నాలుగో శుక్రవారం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ తేజస్విని పేర్కొన్నారు. ప్రజలు క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సీహెచ్ శరత్ బాబు పాల్గొన్నారు.




