Vinukonda: వినుకొండ వేక్షిత జ్యువెలర్స్‌లో కిలేడీ దొంగల స్కెచ్.. ఏసీ బాక్స్ ఊడదీసి ఘోరం!
Vinukonda: వినుకొండ వేక్షిత జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగిన తీరు చూస్తే వ్యాపారస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.
Vinukonda: వినుకొండ వేక్షిత జ్యువెలర్స్‌లో కిలేడీ దొంగల స్కెచ్.. ఏసీ బాక్స్ ఊడదీసి ఘోరం!
Vinukonda: వేక్షిత జ్యువెలర్స్‌లో గురువారం రాత్రి దొంగతనం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు షాపు వెనుక భాగంలో ఉన్న ఏసీ బాక్సులను తొలగించి లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో షాపు యజమాని దుకాణాన్ని తెరిచి చూడగా వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో దొంగతనం జరిగిన విషయం బయటపడింది. దీంతో ఆయన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ బ్రహ్మయ్య ఘటన స్థలానికి చేరుకుని దొంగలు షాపులోకి ఎలా ప్రవేశించారు, ఏ విధంగా చోరీకి పాల్పడ్డారనే అంశాలపై పరిశీలన చేపట్టారు. షాపులోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దొంగలు నగదు లేదా బంగారు ఆభరణాలు ఎంత మేరకు అపహరించారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి నష్టం వివరాలు లెక్కింపు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.




