Kollur: అర్ధరాత్రి గాలుల బీభత్సం.. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
Kollur: కొల్లూరు గ్రామంలో రాత్రి వీచిన భారీ ఈదురు గాలుల బీభత్సం. రోడ్లపై విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు.
Kollur: అర్ధరాత్రి గాలుల బీభత్సం.. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
కొల్లూరు: కొల్లూరు గ్రామంలో రాత్రి వీచిన భారీ గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడటంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై పడిపోయిన చెట్లు, స్తంభాల కారణంగా రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ సిబ్బంది సంఘటనా స్థలాలకు చేరుకుని రోడ్లపై అడ్డుగా ఉన్న చెట్లు, విరిగిపోయిన స్తంభాలను తొలగించే పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story




