Guntur: గుంటూరులో 'ప్యారడైజ్' హీరో నాని సందడి - థియేటర్లో పండుగ వాతావరణం!
Guntur: గుంటూరులోని మైత్రి మాల్లో సందడి చేసిన 'ప్యారడైజ్' హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల. అభిమానులతో కలిసి సినిమా వీక్షించిన చిత్ర బృందం.
Guntur: గుంటూరులో 'ప్యారడైజ్' హీరో నాని సందడి - థియేటర్లో పండుగ వాతావరణం!
Guntur: హీరో నాని బుధవారం గుంటూరు మైత్రి మాల్ లో సందడి చేశారు. ఆయన తాజాగా నటించిన ప్యారడైజ్ విజయవంతంగా ప్రదర్శనమవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా హీరో నాని నగరానికి ఇచ్చేశారు. నాని రాకతో అభిమానులు, ప్రేక్షకులు ఈలలు, కేకల కేరింతలతో ఘన స్వాగతం పలికారు.
అభిమానులకు నాని అభివాదం చేస్తూ ప్రోత్సాహపరిచారు. థియేటర్లో కొద్దిసేపు ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. దీంతో థియేటర్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
మైత్రి మాల్ యాజమాన్యం నిమ్మగడ్డ వెంకటశివ సుబ్రమణ్యేశ్వరావు (సుబ్బు) ఆధ్వర్యంలో పారడైస్ మూవీ చిత్ర బృందం పర్యటించింది. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల పలువురు మైత్రి సినిమాస్ లో ప్రేక్షకులతో కలసి పారడైస్ సినిమా వీక్షించారు.




