Guntur: పొన్నూరులో సెగలు పుట్టిస్తున్న మొక్కజొన్న రాజకీయం!
Guntur: గుంటూరు జిల్లా పొన్నూరులో మొక్కజొన్న కొనుగోళ్లపై రాజకీయం ముదిరింది.
Guntur: పొన్నూరులో సెగలు పుట్టిస్తున్న మొక్కజొన్న రాజకీయం!
Guntur: రైతు మొక్కజొన్న కొనుగోలు విషయంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళతో ఉద్రిక్తంగా మారిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దళారులను అడ్డుపెట్టుకొని రైతుల వద్ద నుండి తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని పొన్నూరు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి ఆరోపించారు. గుంటూరు జిల్లా కేంద్రంలో రైతు దీక్ష పేరుతో అంబటి మురళి నిరసన కార్యక్రమం చేపట్టారు.
మంగళవారం ఉదయం పొన్నూరు మండల పరిధిలోని అంబటి మురళీకృష్ణ స్వగ్రామమైన మామిళ్ళపల్లి లో అక్రమంగా మొక్కజొన్న నిల్వ చేశారంటూ తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గ నాయకులు గ్రామంలోని ఓ గోడౌన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ నాయకులు రైతుల వద్ద నుండి తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి అక్రమంగా నిలువ ఉంచుతున్నారని ఆరోపించారు. దొంగే దొంగ దొంగ అన్న చందంగా వైసిపి నాయకుల తీరు ఉందని ఎద్దేవా చేశారు. వైసిపి నాయకులు మొక్కజొన్న అక్రమంగా నిల్వచేసి తమపై బురద చల్లి ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి అక్రమంగా నిలువ చేసిన మొక్కజొన్నను సీజ్ చేసి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు అక్రమ దందాలకు అలవాటు పడి తమపై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు.




