Vinukonda: నూజెండ్ల వైసీపీ దీక్ష: మాజీ ఎమ్మెల్యే రాకతో ఉద్రిక్తత!
Vinukonda: నూజెండ్లలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ దీక్ష వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాకను కూటమి నేతలు వ్యతిరేకించారు.
Vinukonda: నూజెండ్ల వైసీపీ దీక్ష: మాజీ ఎమ్మెల్యే రాకతో ఉద్రిక్తత!
వినుకొండ: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ రిలే నిరాహార దీక్షలు.. శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం
వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల గ్రామంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
రిలే నిరాహార దీక్షా శిబిరం వద్దకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బొల్లా బ్రహ్మనాయుడు దీక్షా శిబిరం వద్దకు రావడాన్ని కూటమి నాయకులు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీక్షా శిబిరం వద్ద నుంచి వెళ్లిపోవాలని బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు నాయకులకు పోలీసులు సూచించారు. అయితే తాము శాంతియుతంగానే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని వైసీపీ నేతలు తెలిపారు.కొంతసేపు ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడును దీక్షా శిబిరం నుంచి పోలీసులు పంపించి వేశారు. దీంతో అక్కడ పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది.




