Palnadu: అర్ధరాత్రి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అరెస్ట్!
Palnadu: పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అరెస్ట్. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను అడ్డుకోవడానికేనని ఆయన మండిపడ్డారు.
Palnadu: అర్ధరాత్రి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అరెస్ట్!
Palnadu: నేడు పిడుగురాళ్లలో వైసీపీ పార్టీ నామినేషన్ వేస్తున్నందుకు భయంతో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి రాజకీయాలు నేను ఎప్పుడూ చూడలేదని 1989 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ ఇటువంటి రాజకీయాలు ఏనాడో చూడలేదని అన్నారు.
రాష్ట్రంలో మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతం లో అధికార బలం ఉండి కూడా ప్రతిపక్షాలను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతామని అన్నారు. తెలుగుదేశం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చి 43 సంవత్సరాలు అయింది.
అనేక ముఖ్యమంత్రులు చూశా కానీ ఇటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని గతంలో రాజకీయాలు నడిచాయి కానీ నామినేషన్ వేయించి ఎన్నికలు జరిపించిన ముఖ్యమంత్రులు ఉన్నారు అని అన్నారు.
అరెస్టులు చేసి వైసిపి నాయకులను కార్యకర్తను భయభ్రాంతులకు గురి చేస్తూ నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నా పోలీస్ అధికారులకు రాబోయే రోజుల్లో మేము ఏంటో చూపిస్తామని అన్నారు.
ఇటువంటి దానికి ఎలక్షన్లు పెడతాం ఎందుకు మీరే పేరులు రాసుకొని నామినేట్ పదవులు లాగా ఇచ్చుకోవచ్చు గా అని ధ్వజమెత్తారు. ఇంకా టైం ఉంది మేము నామినేషన్ కచ్చితంగా వేస్తామని ఆయన అన్నారు.




