Mangalagiri: రెండు ఏళ్లలో 56వేల కేజీల గంజాయి ధ్వంసం.. హోంమంత్రి అనిత!

Mangalagiri: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఈగల్ టాస్క్ ఫోర్స్ వెబ్‌సైట్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 26 Jun 2026 8:32 PM IST
Mangalagiri
X

Mangalagiri: రెండు ఏళ్లలో 56వేల కేజీల గంజాయి ధ్వంసం.. హోంమంత్రి అనిత!

మంగళగిరి: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళగిరి రత్నాల చెరువులో గల ఈగల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంకి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోం మినిస్టర్ వంగలపూడి అనిత. ఈ కార్యక్రమంలో భాగంగా ఈగల్ టీమ్ వెబ్సైట్ను ప్రారంభించిన హోమ్ మినిస్టర్.

హోమ్ మినిస్టర్ పాయింట్స్

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మాదకద్రవ్యాల వినియోగ నిర్మూలనకై ఈగల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. డ్రగ్స్ ఫ్రీ రహిత సమాజం ఏర్పాటు చేయడమే ఈగల్ టాస్క్ఫోర్స్ టీమ్ యొక్క లక్ష్యం.

రాష్ట్రంలో దాదాపుగా గంజాయి పెంపకాన్ని నిర్మూలించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు 56,000 కేజీల గంజాయిని పట్టుకొని దానిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ఈగల్ టాస్క్ ఫోర్స్ టీం విధానాన్ని పక్క రాష్ట్రాల వాళ్లు కూడా అవలంబించే విధంగా తెలంగాణ మరియు ఒరిస్సా రాష్ట్రాలు కూడా మన ఈగల్ టాస్క్ఫోర్స్ టీం నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది.

గంజాయి ఫ్రీ ఏపి గా మార్చడానికి చర్యలు. రాష్ట్రంలో కాలేజీలు యూనివర్సిటీలు గంజాయి రహిత సెంటర్ గా మార్చడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. సోషల్ మీడియా వేదిక గా గంజాయి వ్యాపారం చేస్తే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం..

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story