Kollur: కొల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకిస్టుకు తీవ్ర గాయాలు
Kollur: కొల్లూరు మండలం ఆవులరిపాలెం వద్ద ఇసుక డంపర్ ఢీకొని ఈపూరులంకకు చెందిన బైకిస్ట్ తోట మల్లికార్జునరావు కాలు తెగిపడింది. తెనాలి ఆసుపత్రికి తరలింపు.
Kollur: కొల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకిస్టుకు తీవ్ర గాయాలు
కొల్లూరు: కొల్లూరు మండలం ఆవులరిపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. AP 39 WQ 4986 నంబర్ గల ఇసుక లోడుతో వెళ్తున్న డంపర్.. హీరో హోండా స్ప్లెండర్ బైక్‌పై కొల్లూరు వెళ్తున్న ఈపూరులంక గ్రామానికి చెందిన తోట మల్లికార్జునరావును వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మల్లికార్జునరావు కాలు తీవ్రంగా దెబ్బతిని తెగిపోయి వేరువేరుగా పడింది వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించటంతో, అంబులెన్స్‌లో ఆయనను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




