Bapatla: రేడియేషన్ భూతం అక్రమ ఎయిర్టెల్ టవర్ నిర్మాణంపై ప్రజా ఆగ్రహం!
Bapatla: బాపట్ల రాజీవ్ నగర్ కాలనీలో జనావాసాల మధ్య అక్రమ ఎయిర్టెల్ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని చల్లా రామయ్య డిమాండ్.
Bapatla: రేడియేషన్ భూతం అక్రమ ఎయిర్టెల్ టవర్ నిర్మాణంపై ప్రజా ఆగ్రహం!
Bapatla: రాజీవ్ నగర్ కాలనీలో రేడియేషన్ భూతం.జనావాసాల మధ్యలో అక్రమ ఎయిర్టెల్ టవర్ నిర్మాణం. నిబంధనలు తుంగలోకి అధికారుల కుంభకర్ణ నిద్ర. రెండు రోజులుగా రోడ్డుపై బైఠాయించిన వందల కుటుంబాలు.
కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని డిమాండ్రా,స్తారోకోకు సిద్ధమైన కాలనీ వాసులు. జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య.
ఈ కాలనీలో చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు వందల సంఖ్యలో ఉన్నారు.గతంలో మేము ఈ టవర్ ను వ్యతిరేకించి అడ్డుకున్నప్పుడు పనులు ఆపేశారు. మరల ఇప్పుడు రాత్రికి రాత్రే ఎలా మొదలుపెట్టారు? వీరికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? స్థలాన్ని లీజుకు ఇచ్చింది ఎవరు? దీని వెనుక ఎంత లావాదేవీ జరిగింది? ప్రజల ఆరోగ్యం కంటే కంపెనీ లాభాలే ముఖ్యమా? దీనిపై జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ అక్రమ నిర్మాణంపై విచారణ జరిపి తక్షణమే ఆపాలి. లేకుంటే ప్రజల ఆగ్రహానికి అధికారులే బాధ్యత వహించాలి" అని డిమాండ్ చేశారు.




