Guntur: గుంటూరులో అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ 2026 సదస్సు!
Guntur: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 11న గుంటూరులో “అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్: ప్రాక్టీస్ గైడ్లైన్స్ 2026”.
Guntur: గుంటూరులో అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ 2026 సదస్సు!
Guntur: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ (ISA) శతాబ్ది వేడుకల్లో భాగంగా, గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహకారంతో “అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్: ప్రాక్టీస్ గైడ్లైన్స్ 2026” అనే అంశంపై CME ను 2026 అక్టోబర్ 11, ఆదివారం నాడు లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి నరసరావుపేట లోక్సభ సభ్యులు, లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రపంచ స్ట్రోక్ సంస్థ (World Stroke Organization) అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ జయరాజ్ డి. పాండియన్, మరియు లలితా హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ పి.వి. రాఘవ శర్మ అతిథులుగా పాల్గొననున్నారు.
2018లో విడుదలైన అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్, ఎనిమిదేళ్ల విరామంతో 2026లో కొత్త అప్ డేట్స్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ నూతన గైడ్ లైన్స్ పై అవగాహన పెంపొందించుకోవడం న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్స్, ఎమర్జెన్సీ డాక్టర్లకు ఎంతో అవసరం. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ స్ట్రోక్ నిపుణులు ఈ సదస్సులో పాల్గొని తమ అనుభవాలను, తాజా వైద్య విధానాలను వివరించనున్నారు.
ఈ సదస్సులో ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరాజిక్ స్ట్రోక్ వంటి వివిధ రకాల స్ట్రోక్ల మేనేజ్ మెంట్ పై నిపుణులు ప్రసంగించనున్నారు. పరస్పర చర్చలు, ప్రశ్నోత్తరాల ద్వారా న్యూరాలజిస్టులు, వైద్యులు, అత్యవసర వైద్య సేవల నిపుణులకు ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని అందించనున్నారు. ఆలస్యంగా గర్భం దాల్చడం (Late Pregnancy) వల్ల మహిళల్లో స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే ప్రమాదం పెరుగుతోంది. తల్లి మరియు బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ సమస్యపై అవగాహన పెంచుకోవడం మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం
ఈ కార్యక్రమంలో పీజీ వైద్య విద్యార్థులు, న్యూరాలజీ రెసిడెంట్లు, న్యూరాలజిస్టులు, ఎమర్జెన్సీ వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు, జనరల్ ప్రాక్టీషనర్లు వివిధ ఆసుపత్రులు, వైద్య సంస్థల నుంచి పాల్గొననున్నారు.ఈ CME సదస్సు 2026 అక్టోబర్ 11, ఆదివారం ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు, గుంటూరు, NH-16, తక్కెళ్లపాడు ఫ్లైఓవర్ సమీపంలోని లలితా పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది.




