Mangalagiri: మంగళగిరిలో అంతర్ జిల్లా బైక్ దొంగల అరెస్ట్: 7 బైకులు సీజ్!

Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలో అంతర్ జిల్లా బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 21 Aug 2026 10:49 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరిలో అంతర్ జిల్లా బైక్ దొంగల అరెస్ట్: 7 బైకులు సీజ్!

మంగళగిరి: మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు, చినకాకాని గ్రామాల్లో ఇటీవల చోరీకి గురైన మోటార్ సైకిళ్ళు అదేవిధంగా తిరుపతి, బాపట్ల. గుంటూరు నందు ద్విచక్ర వాహనాల చోరీలకు గురైన బైకులను మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి నిందితుల నుండి సీజ్ చేయటం జరిగింది. మరియు విచారణలో వీరు తెనాలి రూరల్ పరిధిలోని జగ్గడగుంటపాలెం గ్రామంలో ఇంటి దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది .

కాగా ఈరోజు కేసు దర్యాప్తులో భాగంగా నిందితులైన బుడుగుల పార్థసారథి రామలింగేశ్వరపేట తెనాలి టౌన్ మరియు సారాల రవికుమార్ తెనాలి అని ఇరువురిని అరెస్టు చేసి మంగళగిరి మ్యాజిస్ట్రేట్ కోర్టు వారి ముందు హాజరపరచగా జడ్జి 14 డేస్ రిమాండ్ విధించడం అయినది.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story