Ipur: పెళ్లి పేరుతో యువకుడి మోసం.. ఈపూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
Ipur: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Ipur: పెళ్లి పేరుతో యువకుడి మోసం.. ఈపూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
Ipur: వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొచ్చర్ల గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్న ఇనిమెళ్ల గ్రామానికి చెందిన మల్లవరపు శాంతి వర్ధన్, ఇప్పటికే మరో మహిళతో సంబంధం ఉన్న విషయాన్ని దాచిపెట్టి వివాహం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయం తెలిసిన తొలి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పెళ్లికొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో మోసపోయామని ఆరోపిస్తూ పెళ్లికూతురు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈపూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. "మా అమ్మాయిని మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐలు, ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.




