Ipur: అగ్నిగుండాలలో తీవ్ర విషాదం విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి

Ipur: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అగ్నిగుండాలలో తీవ్ర విషాదం.

KAREEMULLA, VINUKONDA
Published on: 30 Jun 2026 7:53 PM IST
Ipur
X

Ipur: అగ్నిగుండాలలో తీవ్ర విషాదం విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి

Ipur: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై రైతు మద్దిరాల పిచ్చయ్య (32) దుర్మరణం పాలయ్యాడు. సాగు చేస్తున్న వరి నారుకు నీరు పెట్టేందుకు ఆయన పొలానికి వెళ్లాడు. అయితే విద్యుత్ సరఫరా లేకపోవడంతో కరెంట్ స్తంభం ఎక్కి ఎల్టీ లైన్ ఎడ్జ్ ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నించాడు.

ఇదే సమయంలో మెయిన్ లైన్‌కు కరెంట్ సరఫరా కావడంతో పిచ్చయ్య తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు . ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

ఈ విషాద వార్తతో అగ్నిగుండాల గ్రామంలో శోకసంద్రం నెలకొంది. రైతు మృతిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి, సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story