Amaravati: ఇప్పటంలో మళ్లీ కుట్రలా? వైసిపికి జనసేన ఘాటు కౌంటర్!
Amaravati: నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా ఖండించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన కుట్రలను తాడేపల్లి మండల జనసేన అధ్యక్షుడు
Amaravati: ఇప్పటంలో మళ్లీ కుట్రలా? వైసిపికి జనసేన ఘాటు కౌంటర్!
అమరావతి: అన్న తమ్ముళ్ల లా కలిసి ఉండే పల్లెటూరులో మరోసారి కుల గొడవలు పెట్టటానికి వైసిపి కుట్ర చేస్తుంది అని ఆరోపించిన జనసేన.
ఓ డిబేట్లో వైసిపి స్పోక్ పర్సన్ నాగార్జున యాదవ్ ఇప్పటం గ్రామం పై చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం ఇప్పటం గ్రామంలో కుల రాజకీయ కుట్ర చేసింది గత వైసిపి గవర్నమెంట్ లో అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ నే అని తెలిపిన తాడేపల్లి మండల జనసేన అధ్యక్షుడు శ్యామల నాగేశ్వరరావు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ కి స్థలం ఇచ్చారన్న అక్కసుతోనే బస్సు కూడా రాని ఊరికి ఇల్లు పడవేసి పెద్ద రోడ్డు వేసిన ఘనత వైసీపీ ది.
వైసిపి కుట్రకి నష్టపోయిన గ్రామస్తులకి అప్పటి కి ఎలాంటి అధికారం లేని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తప్పించి ఎవరు ఎలాంటి నష్టపరిహారం. ఇవ్వలేదు అని తెలుసుకో నాగార్జున యాదవ్ అంటున్న ఇప్పటం గ్రామ ప్రజలు.
ఇప్పటం గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు పేరుతో ఉన్న కళ్యాణ మండపానికి పలువురు ప్రముఖుల పేర్లు పెట్టింది అప్పటి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయినప్పటికీ అధికారం మారినా కూడా ఇప్పటికీ అవే పేరుతో కళ్యాణ మండపం కొనసాగుతుంది.
నాగార్జున యాదవ్ డిబేట్ లో కూర్చొని నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడటం కాదు నువ్వు ఇప్పటం గ్రామం వస్తే నీకు సత్యాలు చూపిస్తాం అంతేకానీ జనసేన మీద కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద కానీ తప్పుడు ప్రచారం చేసిన తప్పుగా మాట్లాడిన తగిన బుద్ధి చెప్తామని తెలిపిన ఇప్పటం గ్రామ ప్రజలతో పాటు జనసేన నాయకులు వీర మహిళలు.




