Tadepalli: పిఎం మోదీ, సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు!

Tadepalli: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రాజ్ బోడ. తాడేపల్లి పీఎస్‌లో జనసేన నేతల ఫిర్యాదు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 18 July 2026 11:12 AM IST
Tadepalli
X

Tadepalli: పిఎం మోదీ, సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు!

Tadepalli: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో యూట్యూబర్ 'రాజ్ బోడ' అనే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రాజ్ బోడ పై ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

ఈ ముగ్గురు అగ్ర నాయకుల పట్ల అభ్యంతరకర భాషను ఉపయోగిస్తున్న యూట్యూబర్ని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరిన జనసేన నాయకులు

ఈ విషయమై సానుకూలంగా స్పందించిన తాడేపల్లి పోలీసులు వీలైనంత త్వరగా రాజ్ బోడ ని అదుపులో తీసుకుంటామని జనసేన నాయకులకు హామీ ఇచ్చిన సిఐ వీరేంద్రబాబు

గత నెల రోజులుగా రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి, అశాంతిని సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు.

సెక్యులర్ ముసుగులో హిందూ భావజాలంపై వ్యతిరేకత చూపుతున్న కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన నాయకులు హెచ్చరించారు.వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని, మర్యాద పాటించాలని వారు సూచించారు.

కులమతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లా ఉండాలని, పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని పదేపదే చెబుతున్నారని వారు గుర్తు చేశారు.

మతాలను గౌరవించడం జనసేన పార్టీ మూల సిద్ధాంతమని, దీనిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తాడేపల్లి జనసేన మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు తో పాటు భారీగా పాల్గొన్న జనసేన నాయకులు వీర మహిళలు.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story