Tadepalli: సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు!
Tadepalli: ముఖ్యమంత్రి , డిప్యూటీ సీఎంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'పై తాడేపల్లి పీఎస్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.
Tadepalli: సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు!
తాడేపల్లి: ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు: యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'పై జనసేన నేతల ఫిర్యాదు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'పై జనసేన నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ 'ప్రశ్న రావణ్ 'పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రావణ్ హిద్మ వంటి వ్యక్తులకు మద్దతు తెలుపుతూ, వారి భావజాలాన్ని ప్రచారం చేయడం ద్వారా సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నాడు.
ఇతని తీరు చూస్తుంటే వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది అని ఆరోపించారు.
ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.
పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదు. చట్టపరంగానే కాకుండా, మా పద్ధతిలోనూ తగిన బుద్ధి చెబుతాం అని జనసేన నేతలు ఘాటుగా హెచ్చరించారు.
అంతేకాకుండా సనాతన ధర్మంపై, హిందూ దేవతలపై రావణ్ చేస్తున్న వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
సనాతన ధర్మం గురించి మన హిందూ దేవతల గురించి మాట్లాడేటప్పుడు నాలుక అదుపులో పెట్టుకో.
ఇకపై మా దేవుళ్ల జోలికి గానీ, సనాతన ధర్మం జోలికి గానీ వస్తే ఖబర్దార్ రావణ్ తీవ్ర పరిణామాలు ఉంటాయి అని వారు ఘాటుగా హెచ్చరించారు.
భావప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీయడం సహించేది లేదని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఐటీ కోఆర్డినేటర్ చవాకల కోటేష్ బాబు, గ్రామ అధ్యక్షుడు రాజా రమేష్, 19వ వార్డు అధ్యక్షులు దినేష్ చక్రవర్తి, ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, ఏంటీఎంసీ కార్యదర్శి మేక నాని తదితరులు పాల్గొన్నారు.




