Kanigiri: కనిగిరి ఓటర్ల జాబితాలో అక్రమాలు: కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ వినతి
Kanigiri: కనిగిరి మున్సిపాలిటీ 32 వార్డుల విభజన, ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ శ్రేణులు వినతిపత్రం అందజేశాయి.
Kanigiri: కనిగిరి ఓటర్ల జాబితాలో అక్రమాలు: కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ వినతి
కనిగిరి: కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కనిగిరి మున్సిపల్ కమీషనర్ పర్వతనేని శ్రీధర్ ని వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి మున్సిపాలిటీకి సంబందించి 32 వార్డుల విభజన మరియు ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ఇటీవల విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని,కొన్నేళ్ల క్రితం మృతిచెందిన ఓటర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారన్నారు. ఒక వార్డుల్లోని ఓటర్ల పేర్లు మరో వార్డుకు, ఇంకో పోలింగ్ కేంద్రంలోని ఓటర్లు మరో పోలింగ్ కేంద్రంలోకి మారిపోయాయన్నారు. వార్డులు, పోలింగ్ బూత్‌లలో పేర్లు మారిపోవడంతో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకునేందుకు ఓటర్లు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.
కేవలం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘం చెబుతుందే తప్ప కచ్చితమైన ఓటర్ల జాబితా ప్రకటించడంలో కనీస బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించారు.ఎన్నో ఏళ్లుగా ఒకే వార్డులో ఓటు హక్కు కలిగి ఉన్న వందలాది మంది ఓటర్ల పేర్లను, వారికి ఎటువంటి సమాచారం లేకుండా వేరే సుదూర వార్డుల జాబితాలోకి మార్చారని వివరించారు.
అవకతవకల వల్ల అర్హులైన స్థానిక ఓటర్లు తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే ప్రజాస్వామ్య హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఇది భవిష్యత్తులో స్థానిక వార్డు అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని,కావున, తాము స్పందించి ఈ వార్డు విభజన మరియు ఓటర్ల జాబితాలపై క్షేత్రస్థాయిలో పునఃసమీక్ష (Re-verification) జరిపించాలని కోరుతున్నట్లు తెలిపారు.తప్పులను సరిదిద్ది, అర్హులైన ఓటర్లందరికీ న్యాయం చేయాలని వినయపూర్వకంగా అభ్యర్థన తెలిపారు...
ఈ కార్యక్రమం లో షేక్ అబ్దుల్ గఫార్, మడతల కస్తూరి, పులి శాంతి, కటికల వెంకటరత్నం, రాచపూడి మాణిక్యరావు, తమ్మనేని సుజాత,సిరుప గోవర్ధన్ రెడ్డి, పులి శ్రీనివాసులు రెడ్డి, అయిమల్ల నాగమణి, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, షేక్ పోలిచర్ల రహీం భాష, పాపసాని కృష్ణారెడ్డి, నక్క రామకృష్ణ, యర్రబెల్లి దేవరాజ్, షేక్ నజీబ్, పలుకూరి భాస్కర్, బచ్చు వెంగళరావు గుప్తా, అచ్చాల శ్రీనివాసరెడ్డి, వంకదారి వెంకటరాజా, కన్నెటి సుబ్బారెడ్డి, భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, సొరకాయ చిన్న కాశిరెడ్డి ,సూరసాని చంద్రశేఖర్ రెడ్డి, బాపట్ల కొండలరావు,ఏకుల వెంకటసుబ్బారెడ్డి, షేక్ షకీల, ఇండ్ల భాను, దర్శి పని కుమార్, పోలక సిద్ధారెడ్డి, కనమర్ల వెంకటేశ్వర్ రెడ్డి, దారుకు మల్లి కోటిరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు...




