Karamchedu: రూ.4 కోట్లతో శుద్ధి జల కేంద్రాలు ప్రారంభం - పురందేశ్వరి

Karamchedu: బాపట్ల జిల్లా కారంచేడులో రూ.4 కోట్లతో నిర్మించిన 3 శుద్ధి జల కేంద్రాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 4 Sept 2026 11:42 PM IST
Karamchedu
X

Karamchedu: రూ.4 కోట్లతో శుద్ధి జల కేంద్రాలు ప్రారంభం - పురందేశ్వరి

కారంచేడు: అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్–2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, అందులో భాగంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీరు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

బాపట్ల జిల్లా కారంచేడులో దగ్గుబాటి దంపతులు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.4 కోట్లతో నిర్మించిన మూడు శుద్ధి జల కేంద్రాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు.

ప్రస్తుతం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అర్హులకు పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు.మూడు శుద్ధి జల కేంద్రాల నిర్మాణానికి ONGC సంస్థ రూ.3 కోట్ల CSR నిధులు అందించగా.. దగ్గుబాటి దంపతుల కుమారుడు హితేష్ చెంచురామ్ రూ.1 కోటి సొంత నిధులు సమకూర్చారు. కార్యక్రమంలో ఎంపీ తన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story