Palnadu: రైతుల హాహాకారాలు: పురుగుల మందు డబ్బాలతో మిర్చి రైతుల ఆవేదన!
Palnadu: రూ.1.50 కోట్ల మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారైన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.
Palnadu: రైతుల హాహాకారాలు: పురుగుల మందు డబ్బాలతో మిర్చి రైతుల ఆవేదన!
పల్నాడు: కారంపూడి మండల పరిధిలోని గాదివారిపల్లి, బట్టువారిపల్లి, కాచవరం గ్రామానికి చెందిన నష్టపోయిన మిర్చి రైతులు తమకు జరిగిన ఆర్థిక నష్టంపై ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు న్యాయం చేయాలని కోరుతూ పురుగుల మందు డబ్బాలు చేతబట్టి నిరసన తెలిపారు. సుమారు రూ. కోటి 50 లక్షలు మిర్చిని కొనుగోలు చేసి రైతుల డబ్బులు చెల్లించకుండా చల్లా అయ్యప్ప పరారీలో ఉన్నాడని ఆరోపించారు.
ఈ ఘటనలో దాదాపు 70 మంది రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, తమ కష్టార్జిత సొమ్ము తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. తమకు డబ్బులు చెల్లించకపోవడంతో గతంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా డీఎస్పీ ద్వారా ఎస్ఐకి అ కేసును బదిలీ చేయగా విచారణ సమయంలో అయ్యప్ప భార్య హైకోర్టు ఆశ్రయించడంతో ఎస్ఐ వాసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తాము ఏమి చేయలేమని పంపించేశారని రైతులన్నారు.
గత రెండు రోజులు క్రితం రైతులందరూ కలిసి మరొకసారి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా మీరు ఇంటికి వెళ్లి లెక్కలు చూసుకోండి గాని మేము ఏమి చేయలేము అని చేతులెత్తేయటంతో రైతులందరూ కలిసి అయ్యప్ప ఇంటికి వెళ్లి లెక్కలు చూడాలని ఒత్తిడి చేయడంతో అతని భార్య లక్ష్మి ఒంటిపై పురుగుమందు పోసుకొని తాగినట్లు నటి నటిస్తూ తమన్న బయటకు పంపించేసి గడియవేసుకున్నారని రైతులు తెలిపారు.. మమ్మల్ని మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టేందుకు ఆమె పురుగు మందు తాగి నాటకాలు ఆడుతున్నట్లుగా బాధిత రైతులు ఆరోపించారు.




