Bapatla: బాపట్ల 20వ వార్డు జనసేన అభ్యర్థిగా కారుమూరి ఆంజనేష్ నామినేషన్!

Bapatla: బాపట్ల పట్టణం 20వ వార్డు కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థిగా కారుమూరి ఆంజనేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేసి ప్రజల మనిషిగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

Bakka Deepak, Bapatla
Published on: 16 Nov 2026 9:22 PM IST
Bapatla
X

Bapatla: బాపట్ల 20వ వార్డు జనసేన అభ్యర్థిగా కారుమూరి ఆంజనేష్ నామినేషన్!

బాపట్ల: జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 20వ వార్డు నందు జనసేన పార్టీ నుండి ఎన్నికల బరిలో తాను ఉన్నట్లు కారుమూరి ఆంజనేష్ తెలియజేశారు. జనసేన పార్టీకి ఎన్నో సంవత్సరాల నుండి నమ్మిన బంటుగా ఆంజనేష్ ఉంటూ తన సేవలను జనసేన పార్టీకి అంకితం చేసినట్లు అయిన వెల్లడించారు.

బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఏ పనైనా తన మార్కుని నియోజకవర్గంలో కనపరుస్తారు. ప్రజలతో అనునిత్యం అందుబాటులో ఉంటూ 20వ వార్డు ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు కలగడం సంతోషదాయకం అని ఆంజనేష్ అన్నారు. వార్డ్ ప్రజల సమస్యలను అనునిత్యం తెలుసుకుంటూ ప్రజల మనిషిగా నిలబడతానని ఆంజనేష్ తెలియజేశారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla