Gurazala: టీటీడీ వీఐపీ లెటర్లను కూడా అమ్ముకుంటున్నారు కాసు మహేష్ రెడ్డి
Gurazala: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు టీటీడీ వీఐపీ దర్శన లెటర్లను కూడా అమ్ముకుంటున్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు.
Gurazala: టీటీడీ వీఐపీ లెటర్లను కూడా అమ్ముకుంటున్నారు కాసు మహేష్ రెడ్డి
Gurazala: గురజాల నియోజకవర్గంలో అవినీతి తారస్థాయికి చేరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ లెటర్లు కూడా ఎమ్మెల్యే, దేవస్థానం బోర్డు మెంబర్లు, ఎమ్మెల్సీ అమ్ముకుంటున్నారు అని కాసు అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతలు చివరికి పవిత్రమైన తిరుమల తిరుపతి విఐపి లెటర్లు కూడా అమ్ముకుంటున్నారంటే ప్రజలు ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
జగన్మోహన్ రెడ్డితో, పార్టీ నాయకులతో ఫోటోలు దిగిన పార్టీలో తిరిగే సామాన్య కార్యకర్త తప్పు చేస్తే దానిని పార్టీకి అంటకడతారా అంటూ, చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగి మానభంగాలు, మర్డర్లు చేస్తే అవి చంద్రబాబు నాయుడు చేపించినట్లేనా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తిరుపతి దేవస్థానం వీఐపీ లెటర్లు ఎవరు అమ్ముకుంటున్నారు ఎవరు దర్శనానికి వెళ్లి వస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని, అయినా దేవస్థానంలో విఐపి దర్శనాలకు లెటర్లు ఇచ్చే అర్హత ప్రభుత్వంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు బోర్డ్ మెంబర్లకు ఉంటుంది తప్ప వైఎస్ఆర్ నాయకుల లెటర్లు ఎలా చెల్లుబాటు అయితాయి అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ధైర్యం ఉంటే హైకోర్ట్ జడ్జితో విచారణ జరిపి నిజానిజాలు ప్రజల ముందు పెట్టాలని ఛాలెంజ్ చేశారు.




