Ketanakonda: ఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో బేస్ బాల్ క్రీడాకారుల ఎంపిక

Ketanakonda: కేతనకొండ ఆర్కే కళాశాలలో ఎన్టీఆర్ జిల్లా బేస్ బాల్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 3 Sept 2026 8:36 PM IST
Ketanakonda
X

Ketanakonda: ఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో బేస్ బాల్ క్రీడాకారుల ఎంపిక

కేతనకొండ: కేతనకొండ లోని ఆర్కే ఇంజినీరింగ్ కళాశాల నందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (SAAP) వారి సారధ్యంలో ఎన్టీఆర్ జిల్లా బేస్ బాల్ జట్టు క్రీడాకారుల ఎంపిక.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న RK College Founder,చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య , ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. వారి నుండి ఎంపికైన క్రీడాకారులను రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు శక్తివంచన లేకుండా కృషిచేసి పట్టుదలతో నమ్మకంతో పోరాడాలని కోరారు అలాగే వారు చదువులో కూడా రాణించాలని అభిలాషించారు SAAP గుర్తింపు లభించిన తర్వాత జరిగేటటువంటి క్రీడా పోటీలలో శక్తి వంచన లేకుండా పాల్గొని భవిష్యత్తులో ఆ సర్టిఫికెట్లతో ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story