Vinjanampadu: కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా 3వ గ్రాడ్యుయేషన్ డే!

Vinjanampadu: వింజనంపాడులోని కేకేఆర్ & కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) కళాశాలలో 3వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ANANDBABU,	PRATTIPADU
Published on: 22 Aug 2026 10:19 PM IST
Vinjanampadu
X

Vinjanampadu: కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా 3వ గ్రాడ్యుయేషన్ డే!

వింజనంపాడు: వింజనంపాడులోని కేకేఆర్ & కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (KITS) కళాశాలలో 3 వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్యంత ఘనంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. నిన్నటి విద్యార్థులూ నేడు పట్టభద్రులు అవుతున్న ఈ అపూర్వ క్షణాలకు, విద్యావేత్తలు, ప్రముఖులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.

ఈ కార్యక్రమానికి జేఎన్టీయూకే (JNTUK) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే, ఇన్ఫోసిస్ (Infosys) ఏపీ డెలివరీ ,డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ శ్రీ నర్రా సురేష్ గారు గౌరవ అతిథిగా (Guest of Honour) హాజరయ్యారు. కళాశాల చైర్మన్ సుబ్బారావు గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు, ప్రిన్సిపల్ డా. పి. బాబు గారు, అకడమిక్ డైరెక్టర్ డా. కె. హరిబాబు గారు పాల్గొన్నారు.

జేఎన్టీయూకే వీసీ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులు కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా నూతన ఆవిష్కరణలతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

ఇన్ఫోసిస్ హెడ్ నార సురేష్ గారు మాట్లాడుతూ, కార్పొరేట్ రంగంలో రాణించడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు నిరంతర అభ్యాసన ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువ ఇంజనీర్లకు అతిథుల చేతుల మీదుగా ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలు మరియు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు.

కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు గారు,కళాశాల కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు ప్రిన్సిపాల్, డైరెక్టర్ మరియు ఇతర అధ్యాపక బృందం విద్యార్థులను అభినందిస్తూ వారి భవిష్యత్తు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుక విద్యార్థుల కేరియర్‌ లో ఒక మరుపురాని ఘట్టంగా నిలిచిపోవాలని ఆశించారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story