Parchur: పర్చూరు ఎంపీపీగా కొల్లా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక!
Parchur: బాపట్ల జిల్లా పర్చూరు ఎంపీపీగా కొల్లా శ్రీనివాసరావు (ఫ్యాక్టరీ), వైస్ ఎంపీపీగా వినకోట సతీష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణం చేశారు.
Parchur: పర్చూరు ఎంపీపీగా కొల్లా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక!
బాపట్లా జిల్లా, పర్చూరు: పర్చురు మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు.MPP ఎన్నికలో బాగంగా MPTC అందరు ఎకగ్రివంగా ఎన్నుకున్నరు. నూతనంగా ఎన్ని కైన మండల పరిషత్ అధ్యక్షులు గా కొల్లా శ్రీనివాసరావు (ఫ్యాక్టరీ) (ఎంపీపీ), ఉపాధ్యక్షులు (వైస్ ఎంపీపీ), వినకోట సతీష్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమాంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరై నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు తెలిపారు
ఈ సందర్భంగా నూతన ఎంపీపీ లు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై నిరంతరం అవగాహన కలిగి ఉంటానని తెలిపారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, అందరి సహకారంతో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.




