Bapatla: బాపట్ల 31వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా కొట్ర ఏడుకొండలు!

Bapatla: బాపట్ల పట్టణంలోని 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైసీపీ తరఫున కొట్ర ఏడుకొండలు బరిలోకి దిగారు.

Bakka Deepak, Bapatla
Published on: 19 Nov 2026 10:11 AM IST
Bapatla
X

Bapatla: బాపట్ల 31వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా కొట్ర ఏడుకొండలు!

Bapatla: జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నుండి బాపట్ల పట్టణం లోని 31 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గా కొట్ర ఏడుకొండలు బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా ఏడుకొండలు మాట్లాడుతూ వార్డులో పర్యటిస్తున్న నేపథ్యంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

బాపట్ల పట్టణం లోని 31 వార్డులో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా తయారైందని ఆయన అన్నారు. వీధి దీపాలతో పాటు అనేక సమస్యలు 31వ వార్డులో ఉన్నట్లు ఆయన మాట్లాడారు. తాను కౌన్సిలర్ అవగానే ప్రతి సమస్యకు చెక్ పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

31 వ వార్డు ప్రజల ఆశీర్వాదాలు తనకు అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన వార్డులో అనునిత్యం తాను అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించే దిశగా తాను పనిచేస్తానని కొట్ర ఏడుకొండలు స్పష్టం చేశారు. తనకు ఇంతటి అవకాశం కల్పించిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి కి కృతజ్ఞతలు తెలిపారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla