Vinukonda: వినుకొండలో పిడుగుల మోత: ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు!

Vinukonda: వినుకొండ నియోజకవర్గంలో పిడుగుపాటు విషాదం! వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు.

KAREEMULLA, VINUKONDA
Published on: 19 Jun 2026 8:25 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో పిడుగుల మోత: ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు!

Vinukonda: వినుకొండ నియోజకవర్గ పరిధిలో గురువారం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పిడుగుపాటు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు తనతో పాటు మరికొందరితో కలిసి పొలం నుంచి తిరిగి వస్తుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో ఉన్న గుడిపాటి బాల కోటయ్య,యలగల శ్రీను,చేనుబోయిన కోటయ్య గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అదే సమయంలో శావల్యాపురం మండలం కారుమంచి ఎస్సీ కాలనీకి చెందిన మల్లవరపు కోటేశ్వరరావు పశువులను మేపేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.

వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, గ్రామాల్లో శోకసంద్రం నెలకొంది. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story